Raghu Tatha : 'రఘుతాత' నుంచి గ్లింప్స్ రిలీజ్..బోర్డు మీద అక్షరాలను చెరిపేస్తున్న కీర్తి
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలకు సరిపోయే నటీమణి కీర్తి సురేశ్, 'మహానటి'సినిమాతో సత్తా చాటుకుంది.
తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'రఘు తాత'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.హోంబలే ఫిల్మ్స్ లాంటి పాపులర్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైంది.
ఇప్పటికే 'రఘు తాత' నుంచి కీర్తి సురేశ్ క్యారెక్టర్ గ్లింప్స్ విడుదలైంది.ఈ సినిమాలో కీర్తి, టీచర్ పాత్రలో కనిపించనుంది.
తాజాగా విడుదలైన మరో గ్లింప్స్ స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంది.ఒక బోర్డ్‌పై 'హిందీ వర్డ్ ఆఫ్ ది డే' అని ఉండి.. దాని కింద 'పరీక్ష' అని రాసుంటుంది.
Details
గ్లింప్స్ రిలీజ్
ఆ తర్వాత కీర్తి సురేశ్ వచ్చి హిందీ,పరీక్ష రెండు పదాలను చెరిపేస్తుంది. అప్పుడే ఆ బోర్డ్‌పై 'రఘు తాత' అని టైటిల్ కనిపిస్తుంది. 'మిమ్మల్ని నవ్వించేందుకు, మీ మనసులు గెలుచుకునేందుకు, ఒక విప్లవం సృష్టించేందుకు మీ కయల్విరి సిద్ధమైంది.
రఘు తాతకు సిద్ధమవ్వండి. త్వరలోనే మీ అభిమాన థియేటర్లలో' అంటూ క్యాప్షన్‌తో ఈ గ్లింప్స్‌ను హోంబేల్ ఫిల్మ్స్ రిలీజ్ చేసింది.
'రఘు తాత' సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కీర్తి సురేశ్‌తో పాటు ఎమ్ఎస్ భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనంద్‌సామి, రాజేశ్ బాలకృష్ణన్.. ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షేన్ రోల్డన్ ఈ చిత్రానికి బాణీలను సమకూర్చాడు.
Details
ఈ ఏడాది నాలుగు సినిమాలతో.....
1981లో భాగ్యరాజ్ తెరకెక్కించిన ప్రముఖ తమిళ చిత్రం 'ఇండ్రు పోయి నాలై వా' సినిమాలోని ఒక ప్రముఖ కామెడీ సీన్ ఆధారంగా 'రఘు తాత' తెరకెక్కిందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
ఈ సీన్‌లో టీచర్‌గా ఉండే రాధికా శరత్‌కుమార్,స్టూడెంట్స్‌కు హిందీ పదాన్ని నేర్పించాలనుకుంటారు.
కానీ పిల్లలు అది వినకుండా 'రఘు తాత' అని గోల చేస్తారు. అప్పట్లో ఈ సీన్ కోలీవుడ్ ప్రేక్షకులను తెగ నవ్వించగా.. ఇప్పుడు దానిని ఆధారంగా ఏకంగా ఒక సినిమా కథే పుట్టుకొచ్చింది.
ఈ ఏడాది 4సినిమాలు..
నాని 'దసరా'లో కీర్తి నటన మెప్పించింది.చిరంజీవి చెల్లెలిగా నటించిన 'భోలా శంకర్' ఆశించిన మేర ఆడలేదు.
ఇక ఈ ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విప్లవం సృష్టించనున్న కీర్తి సురేశ్
Kayalvizhi is all set to make you laugh, win your hearts, and start a revolution. Get ready for #Raghuthatha! Coming soon to a cinema near you.
— Hombale Films (@hombalefilms) January 2, 2024
ஆத்தி… கிளம்பிட்டாயா கிளம்பிட்டாயா!
உங்களை சிரிக்கவும் சிந்திக்கவைக்கவும் வருகிறாள் வள்ளுவன்பேட்டையின் வீர மங்கை கயல்விழி!
ரகு… pic.twitter.com/q6v7ouUvWX