Keerthy Suresh:12వ తరగతిలో ఉన్నప్పటినుంచి ప్రేమించుకుంటున్నాం..తన ప్రేమ,పెళ్లి గురించి విశేషాలను పంచుకున్న కీర్తి సురేశ్
ఈ వార్తాకథనం ఏంటి
చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో కీర్తి సురేష్ గత కొద్ది రోజుల క్రితం ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.
కీర్తి తన ప్రేమ,పెళ్లి గురించి ముఖ్యమైన వివరాలను పంచుకున్నారు.
12వ తరగతి చదువుతున్నప్పుడు తాను ఆంటోనీతో ప్రేమలో పడినట్లు కీర్తి వెల్లడించారు.
15 సంవత్సరాల నుంచి వారు ప్రేమలో ఉన్నారని చెప్పారు. తన ప్రేమ వివరాలు కీర్తి మాటల్లోనే చూద్దాం.
వివరాలు
2010లో మొదటిసారి ప్రపోజ్ చేశాడు: కీర్తి
2010లో మొదటిసారి ప్రపోజ్ చేశాడు ఆంటోనీ. నేను మా కుటుంబంతో రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు, అతడు కూడా వచ్చాడు. కానీ కుటుంబంతో ఉండి అతడిని కలవలేకపోయాను.
ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయమని చెప్పాను. 2016 నుండి మా సంబంధం మరింత బలపడింది. ఆంటోనీ నాకు ప్రామిస్ రింగ్‌ను ఇచ్చాడు. మేము పెళ్లి చేసుకునేవరకు దాన్ని నేను తీయలేదు. నా సినిమాల్లో కూడా ఆ రింగ్‌ను మీరు గమనించవచ్చు.
నా కంటే ఆంటోనీ ఏడేళ్లు పెద్దవాడు. అతడు ఆరేళ్ల నుంచి ఖతార్‌లో వర్క్ చేస్తున్నాడు. నా కెరీర్‌కు ఎంతగానో సహకరిస్తాడు. అతడు నా జీవితంలోకి రావడం, అది నా అదృష్టం అని చెప్పింది.
వివరాలు
మా ప్రేమ విషయాన్ని ప్రైవేటుగా ఉంచుకోవాలని అనుకున్నాం: కీర్తి
"పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు మా ప్రేమ విషయాన్ని ప్రైవేటుగా ఉంచుకోవాలని అనుకున్నాం. నా సన్నిహితులకు, కొన్ని ఇండస్ట్రీలోని వ్యక్తులకు మాత్రమే మా ప్రేమ విషయం తెలుసు. సమంత, విజయ్, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్, ఐశ్వర్యలక్ష్మి... ఇలా కొందరికి మాత్రమే తెలియదు," అని కీర్తి చెప్పింది.
"2022లో పెళ్లి చేసుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాం. 2024 డిసెంబర్‌లో పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తరువాత పసుపుతాడుతో సినిమా ప్రచారాల్లో పాల్గొంటున్నాను. ఇది ఎంతో పవిత్రమైనది, శక్తిమంతమైనది. మంచి ముహూర్తాన్ని చూసి, మంగళసూత్రాలను బంగారు గొలుసులో మార్చుకుంటా," అని కీర్తి తన ప్రేమ జీవితం గురించి పూర్తి వివరాలు ఇచ్చారు.