Page Loader
Keerthy Suresh : పెళ్లిపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన
పెళ్లిపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన

Keerthy Suresh : పెళ్లిపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

తన రిలేషన్‌షిప్‌ గురించి నటి కీర్తి సురేశ్‌ తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఆంటోనీతో దిగిన ఫోటోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 15 సంవత్సరాల స్నేహం అనంతరం ఈ బంధం జీవితాంతం కొనసాగుతుందని కీర్తి వెల్లడించారు. ఈ పోస్ట్‌పై పలువురు ప్రముఖులు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. దీనిపై నటి రాశీఖన్నా స్పందించింది. మేము ఇప్పుడే తెలుసుకున్నామని, కంగ్రాట్స్‌ అంటూ కామెంట్‌ చేసింది. కీర్తి సురేశ్‌ 2013లో 'గీతాంజలి' అనే మలయాళీ సినిమాతో నటిగా వెండితెరపై అడుగుపెట్టారు.

Details

బేబీ జాన్ చిత్రంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ

టాలీవుడ్ లో 'నేను శైలజ' చిత్రం ద్వారా కీర్తి అరంగేట్రం చేశారు. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో ప్రస్థానం కొనసాగించారు. 'మహానటి' సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న ఆమె, ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నాయి. ప్రస్తుతం రివాల్వర్‌ రీటా, బేబీ జాన్ చిత్రాల్లో పనిచేస్తోంది. 'బేబీ జాన్' చిత్రంలో వరుణ్‌ ధావన్‌ హీరోగా ఆమె బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది.