Page Loader
Keerthy Suresh: మాల్దీవుల్లో మెరిసిన కీర్తి సురేష్.. భర్తతో కలసి హాలిడే ఎంజాయ్!
మాల్దీవుల్లో మెరిసిన కీర్తి సురేష్.. భర్తతో కలసి హాలిడే ఎంజాయ్!

Keerthy Suresh: మాల్దీవుల్లో మెరిసిన కీర్తి సురేష్.. భర్తతో కలసి హాలిడే ఎంజాయ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటి కీర్తి సురేష్ ప్రస్తుతం తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రను ఆనందంగా గడుపుతున్నారు. ఈ హాలిడే ట్రిప్‌లో తీసిన ఎన్నో అందమైన ఫోటోలు, వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కీర్తి ఈ ట్రావెల్‌ డైరీని ఒక స్టైలిష్ సెల్ఫీతో ప్రారంభించారు. తెల్లటి దుస్తులు, పెద్ద టోపీ ధరించి పట్టు తెచ్చిన లుక్‌లో ఉన్న ఆమె ఫోటో మొదటగా పోస్ట్ చేశారు. అనంతరం మాల్దీవుల్లోని వారు బస చేసిన రిసార్ట్‌లో పడవ విహారం చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేశారు.

Details

సముద్రతీరాన సరదాగా గడిపిన కీర్తి

ఆపై భర్త ఆంటోనీతో కలిసి దిగిన ఒక అందమైన జంట ఫోటోను పోస్ట్ చేశారు, అది కీర్తి రిలాక్స్డ్‌, స్టైలిష్‌ మూడ్‌ను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. వెకేషన్‌ మూడ్‌లో ఉన్న కీర్తి, భర్తతో కలిసి బీచ్‌పై నడవడం, టేబుల్ టెన్నిస్ ఆడటం, సముద్రతీరాన గడిపిన శాంతమైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాక మాల్దీవుల్లో రుచి చూసిన ప్రత్యేక వంటకాల ఫోటోలను కూడా ఆమె తన పోస్ట్‌లో చేర్చారు. పోస్ట్ చివర్లో, మేకప్ వేయించుకుంటున్న సరదా వీడియోను కూడా షేర్ చేసిన కీర్తి, దానికి "పర్వాలేదు" అనే కామెంట్ పెట్టారు. ఆమె పెట్టిన క్యాప్షన్ "మానసికంగా మాల్దీవుల్లో, శారీరకంగా ఇక్కడే (చివరి వరకు చూడండి)" అని ఉండటం విశేషం.

Details

గతేడాది డిసెంబర్ లో కిర్తీ సురేష్

గతేడాది డిసెంబర్‌లో కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్‌లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారి మధ్య ప్రేమ, స్నేహం పటిష్టంగా ఉన్నట్లే ఈ ట్రిప్‌లో దర్శనమిస్తోంది. సినిమా విషయానికి వస్తే, కీర్తి త్వరలో రివాల్వర్ రీటా అనే మహిళా ప్రాధాన్యత కలిగిన కామెడీ చిత్రంలో నటించనున్నారు. కె. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ సినిమాలో రాధికా శరత్‌కుమార్, రెడ్డిన్ కింగ్స్లే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ పతాకాలపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.