Honey Rose: హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్.. ప్రముఖ వ్యాపార వేత్త.. వయనాడ్‌లో అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత మలయాళ నటి హనీ రోజ్ ఫిర్యాదు మేరకు ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మన్నూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వయనాడ్‌లో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ చేస్తూ హనీ రోజ్ బాబీ చెమ్మన్నూర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా కొచ్చి నుండి వయనాడ్ వచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం బాబీ చెమ్మన్నూర్‌ను అదుపులోకి తీసుకుంది. తదుపరి విచారణ కోసం అతనిని కొచ్చికి తరలించనున్నారు.
వివరాలు
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశాలు
తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హనీ రోజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో గతంలోనూ నటీమణులపై లైంగిక వేధింపుల అంశాలు వివాదాస్పదంగా మారాయి.
ఇప్పుడు హనీ రోజ్ ఆరోపణలతో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో, బాబీ చెమ్మన్నూర్ మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలు నటి హనీ రోజ్‌ను ఉద్దేశించినవి కావని, ఆమె తన మాటలను తప్పుగా అర్థం చేసుకుందని పేర్కొన్నారు.
భారతదేశంలోని ప్రముఖ బంగారం వ్యాపారులలో బాబీ చెమ్మన్నూర్ ఒకరు.
వివరాలు
అసభ్యకర వ్యాఖ్యలు,బాడీ షేమింగ్ కామెంట్స్
ఫుట్‌బాల్ దిగ్గజం డియెగో మారడోనాను కొచ్చికి ఆహ్వానించి తన జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా చేసిన వ్యక్తిగా ఆయన పేరు పొందారు.
అయితే,ఇప్పుడు హనీ రోజ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయన వార్తల్లో నిలిచారు.
2005 నుండి సినీ రంగంలో కొనసాగుతున్న హనీ రోజ్ సోషల్ మీడియాలో భారీగా అభిమానులను కలిగి ఉంది.
ఆమె సినిమాల కంటే ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు,వీడియోల ద్వారా ఎక్కువ పాపులారిటీ సాధించింది.
ఈక్రమంలోనే ఆమెపై సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయి.
కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు,బాడీ షేమింగ్ కామెంట్స్ ఆమెపై వ్యక్తమయ్యాయి.
ప్రముఖ వ్యాపారవేత్త హనీ రోజ్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా మారుస్తోంది.
దీంతో నటి చట్టపరంగా న్యాయం కోసం ముందుకు వచ్చారు.