LOADING...
Dileep: ఎనిమిదేళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో తీర్పు.. నటుడు  దిలీప్‌కు ఊరట
నటుడు  దిలీప్‌కు ఊరట

Dileep: ఎనిమిదేళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో తీర్పు.. నటుడు  దిలీప్‌కు ఊరట

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎనిమిదేళ్ల క్రితం కేరళలో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన లైంగిక వేధింపుల కేసులో సోమవారం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రముఖ మలయాళ నటి కారులో కిడ్నాప్‌ అయ్యి లైంగిక దాడికి గురైన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న మలయాళ స్టార్‌ నటుడు దిలీప్‌ను ఎర్నాకుళంలోని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి అందిన ఆధారాలను పరిశీలించిన అనంతరం అతనిపై ఉన్న ఆరోపణలు రుజువు కాలేదన్న కోణంలో న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

ఎనిమిదేళ్ల పాటు కొనసాగిన విచారణ

2017లో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో భారీ దుమారం రేపింది. నటి ప్రయాణిస్తున్న కారులోనే ఆమెను కిడ్నాప్‌ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిందితుడిగా నటుడు దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు నుంచి బెయిల్‌ పొంది ఆయన విడుదలయ్యాడు. ఎనిమిదేళ్ల పాటు కొనసాగిన విచారణ తర్వాత తాజాగా కోర్టు తీర్పుతో ఈ హైప్రొఫైల్‌ వ్యవహారానికి ముగింపు పలికింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆ కేసులో నటుడు దిలీప్‌ నిర్దోషే:కోర్టు

Advertisement