Page Loader
Allu Arjun: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం.. అల్లు అర్జున్‌పై నమోదైన కేసు కొట్టివేత
ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం.. అల్లు అర్జున్‌పై నమోదైన కేసు కొట్టివేత

Allu Arjun: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం.. అల్లు అర్జున్‌పై నమోదైన కేసు కొట్టివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2024
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా నటుడు అల్లు అర్జున్‌పై ఉన్న కేసును హైకోర్టు ఇవాళ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో నంద్యాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను హై కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ కేసు నేపథ్యంలో అల్లు అర్జున్, మాజీఎమ్మెల్యే శిల్పా రవి, చంద్ర కిషోర్ రెడ్డి కలిసి పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

Details

అల్లు అర్జున్‌కు భారీ ఊరట

అక్కడ అతన్ని చూసేందుకు భారీగా అభిమానులు చేరుకున్నారు. అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు సమకూర్చడం వల్ల ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసుల ఫిర్యాదు ఆధారంగా, అల్లు అర్జున్‌పై సెక్షన్ 144, పోలీస్ యాక్టు 30 ఉల్లంఘనలపై కేసు నమోదైంది. ఈ కేసు పై కోర్టు విచారణ జరిపి, గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ తాజాగా అల్లు అర్జున్‌పై కేసును కొట్టివేసింది. ఈ నిర్ణయంతో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది.