Game Changer - Daku Maharaj: సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ సినిమా బెనిఫిట్ షోను ఈ నెల 10న తెల్లవారుజామున 1 గంటకు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఒక్కో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు.
ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.135 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సినిమా విడుదల రోజున ఆరు షోలు, 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకోవచ్చని స్పష్టం చేసింది.
Details
డాకు మహారాజ్ ఈనెల 12న రిలీజ్
డాకు మహారాజ్ సినిమాకు కూడా ఇదే తరహా సడలింపులు కల్పించారు.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిలిస్తూ ప్రత్యేక ఉత్తర్వులిచ్చింది.
12వ తేదీ ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించుకునే అనుమతి ఇచ్చి, ఒక్కో టికెట్‌ను రూ.500కు విక్రయించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.