Page Loader
Surya : సూర్య-వెంకీ అట్లూరి మూవీలో కీలక షెడ్యూల్‌.. భారీ సెట్‌తో క్రేజీ అప్‌డేట్‌!
సూర్య-వెంకీ అట్లూరి మూవీలో కీలక షెడ్యూల్‌.. భారీ సెట్‌తో క్రేజీ అప్‌డేట్‌!

Surya : సూర్య-వెంకీ అట్లూరి మూవీలో కీలక షెడ్యూల్‌.. భారీ సెట్‌తో క్రేజీ అప్‌డేట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో సూర్య, క్లాస్ మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. హార్ట్‌ఫుల్ ఎమోషన్లకు పేరుగాంచిన వెంకీ అట్లూరి, ఈసారి పూర్తిగా కొత్త కోణంలో మాస్ యాంగిల్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశ శరవేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ భారీ సెట్‌ వేసి, సూర్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. విశేషం ఏమిటంటే, ఇదే సెట్లో గతంలో 'గుంటూరు కారం' చిత్రం కూడా తెరకెక్కింది. సూర్య ఎనర్జీ, యాక్షన్‌ స్కిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Details

సంగీతాన్ని అందించనున్న జీవీ ప్రకాష్

ఈ సినిమాలో ఆయన మాస్‌ ఆడియెన్స్‌ను పూర్తిగా మెప్పించనున్నారు. పవర్‌ఫుల్ డైలాగ్స్‌, ఇంటెన్స్‌ ఫైట్స్‌, సూర్య స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఇవన్నీ సినిమాలో ప్రత్యేక ఎలివేషన్‌ తీసుకురానున్నాయని అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది జీవీ ప్రకాష్‌ కుమార్. 'సూరరై పోట్రు', 'జై భీమ్' వంటి సూపర్‌హిట్‌ ఆల్బమ్‌లు ఇచ్చిన సూర్య-జీవీ కాంబో మరోసారి మ్యూజిక్‌ మ్యాజిక్‌ రిపీట్‌ చేయబోతోంది. వెంకీ అట్లూరి కథకు అనుగుణంగా జీవీ ఇప్పటికే సంగీతపు పనులను మొదలు పెట్టినట్టు సమాచారం.ప్రత్యేకతను చాటే సౌండ్‌ట్రాక్‌ అందించడానికి జీవీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. కథానాయిక ఎంపిక విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తొలుత భాగ్యశ్రీ భోర్సే పేరు వినిపించగా, తరువాత కాయదు లోహర్‌ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.