Hit 3 : 'హిట్ 3'లో మృదుల పాత్రలో కేజీఎఫ్ హీరోయిన్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని ఇటీవల 'సరిపోదా శనివారం'తో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు.
ఇప్పుడు 'HIT: ది థర్డ్ కేస్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని కథానాయికగా పరిచయం కానుంది.
ఈ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించాలని మేకర్స్ భావించారు. అయితే లీకైన వీడియో కారణంగా ఆ ప్రకటనను ముందుగా చేయాల్సి వచ్చింది.
షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ కావడం నాని, అభిమానులను నిరాశపరిచింది.
ఫ్యాన్స్ లీక్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 'HIT 3' శైలేష్ కొలన దర్శకత్వంలో రూపొందుతోంది.
Details
మే 1 మూవీ రిలీజ్
వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
2025 మే 1న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలోని శ్రీనిధి శెట్టి పాత్రపై ప్రేక్షకుల ఆసక్తి పెరుగుతోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా, 'హిట్-3' చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, ఆమె పాత్ర పేరు 'మృదుల' అని వెల్లడించారు.
అర్జున్ సర్కార్ అనే ప్రధాన పాత్రలో నాని నటిస్తున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు.