కేజీఎఫ్ చాప్టర్ 2 సునామీకి సంవత్సరం, అభిమానుల అసంతృప్తి అదే
బాహుబలి ప్రేరణతో పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ములేపుదామని చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా బాహుబలి రేంజ్ ని అందుకోలేకపోయాయి. ఒక్క కేజీఎఫ్ మాత్రమే ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచింది. కేజీఎఫ్ మొదటి చాప్టర్ చాలా సైలెంట్ గా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద దాని దూకుడును చూపించింది. కేజీఎఫ్ కారణంగా కేజీఎఫ్ చాప్టర్ 2పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీన కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అయింది. విడుదలైన అన్ని భాషల్లో విజయ పరంపరను కొనసాగించింది కేజీఎఫ్ చాప్టర్ 2. 1200 కోట్ల కలెక్షన్లు అందుకుని కన్నడ సినిమా చరిత్రలో సరికొత్త చాప్టర్ ని లిఖించింది.
యష్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది?
ఈరోజుతో కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంత హోంబలే ఫిలిమ్స్ ట్విట్టర్ వేదికగా కేజీఎఫ్ చాప్టర్ 2లోని చిన్నపాటి వీడియోను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ 2 జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, హాంబలే ఫిలిమ్స్ రిలీజ్ చేసిన వీడియో పై కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్లు. అందులో కొన్ని కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజై, సంవత్సరం కావస్తున్నా కూడా హీరో యష్ తర్వాత సినిమా ఇంకా అనౌన్స్ కాకపోవడం పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యష్ తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందోనని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.