Page Loader
Kiara Advani : ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న  కియారా అద్వానీ  
ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న గేమ్ ఛేంజర్ హీరోయిన్

Kiara Advani : ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న  కియారా అద్వానీ  

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2023
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో కియారా అద్వానీ తెలుగు ప్రేక్షులను అలరించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగస్తున్న ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తోంది. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది. పెళ్లైనా కూడా ఆమెకు వరస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే కియారాకు ప్రెగ్నెంట్ అవ్వాలని ఉందని తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఈ వ్యాఖ్యలను ఆమె ఇప్పుడు వెల్లడించలేదు. 2019లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమా రిలీజ్ సమయంలో చెప్పింది. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చిందన్న పుకార్లు రావడంతో, ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్‌గా మారడం విశేషం.

Details

రాంచరణ్, హృతిక్ రోషన్ సినిమాలతో కియారా అద్వానీ బిజీ

గర్భం దాల్చితే తనకు నచ్చింది ఏదైనా తినొచ్చని, అడ్డు చెప్పేవారే ఉండరని, తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలని కియారా ఆ సమయంలో పేర్కొంది. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఫుడ్ కోసమే ప్రెగ్నెంట్ కావాలని ఆమె అప్పట్లో సరాదా వ్యాఖ్యలు చేసింది కియారాకు పెళ్లయింది కాబట్టి తన సినిమాలన్నీ పూర్తి చేసి త్వరలోనే ఈ గుడ్ న్యూస్ చెప్తుందేమోనని అభిమానులు వేచి చూస్తున్నారు. ఇక రాంచరణ్ తో గేమ్ ఛేంజర్, హృతిక్ రోషన్ వార్ 2లో కియారా అద్వానీ నటిస్తోంది.