
గేమ్ ఛేంజర్ సినిమాపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు: అభిమానులకు పూనకాలే
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.
శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండనుందని సమాచారం.
గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ గత రెండేళ్ళుగా కొనసాగుతోందని, ఈ సంవత్సరం చివరి నాటికి షూటింగ్ పూర్తవుతుందని, వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వస్తుందని కియారా అంది.
సినిమా చాలా అద్భుతంగా వస్తోందని, అందరి ఊహలను మించి సినిమా ఉండబోతుందని, ముఖ్యంగా అభిమానులకు విందుభోజనంలా ఉండనుందని కియారా తెలియజేసారు.
Details
గ్లింప్స్ కోసం అభిమానుల వెయిటింగ్
అలాగే రామ్ చరణ్ తనకు మంచి స్నేహితుడని, దర్శకుడు శంకర్ నుండి చాలా నేర్చుకుంటున్నానని కియారా అద్వానీ తెలియజేసింది.
గేమ్ ఛేంజర్ సినిమా నుండి చాలా రోజులుగా ఎలాంటి అప్డేట్ రాలేదు. మోషన్ పోస్టర్ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
గేమ్ ఛేంజర్ నుండి గ్లింప్స్ వీడియో రిలీజైతే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి గ్లింప్స్ వీడియోతో అభిమానుల ఆశను ఎప్పుడు నెరవేరుస్తారో చూడాలి.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సునీల్, అంజలి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.