Page Loader
Don 3: డాన్‌ 3 హీరోయిన్ గా కియారా అడ్వాణీ కన్‌ఫర్మ్‌!
డాన్‌ 3 హీరోయిన్ గా కియారా అడ్వాణీ కన్‌ఫర్మ్‌!

Don 3: డాన్‌ 3 హీరోయిన్ గా కియారా అడ్వాణీ కన్‌ఫర్మ్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంకొన్ని రోజుల్లో 'వార్‌ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ. ఈ సినిమాతో పాటు ఆమె చేతిలో మరో భారీ ప్రాజెక్ట్‌ 'డాన్‌ 3' కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. అయితే ఇటీవల కియారా స్థానంలో కృతి సనన్‌ నటించబోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి 'డాన్‌ 3' షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కొన్ని కారణాల వల్ల చిత్రీకరణలో ఆలస్యం జరిగిందని తెలుస్తోంది.

వివరాలు 

2026లో  'డాన్‌ 3' సినిమా చిత్రీకరణ ప్రారంభం 

ముఖ్యంగా కథానాయికగా ఎంపికైన కియారా అడ్వాణీ గర్భవతిగా మారడం కూడా ఆలస్యం అయ్యేందుకు ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందట. ప్రస్తుతం 'డాన్‌ 3' చిత్రబృందం 2026లో సినిమా చిత్రీకరణను ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు పూర్తిచేసిందని సమాచారం. అంతేకాకుండా, ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా నటించేది కృతి సనన్‌ కాదని.. కియారానే'' అని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.