Loading...
Kiara Advani: 'టాక్సిక్' తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్‌లో ఛాన్స్?
'టాక్సిక్' తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్‌లో ఛాన్స్?

Kiara Advani: 'టాక్సిక్' తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్‌లో ఛాన్స్?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 30, 2026
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా యశ్‌ సరసన నటించిన 'టాక్సిక్' సినిమాతో ఆమె పేరు సౌత్‌లోనూ మార్మోగుతోంది. ఈ క్రమంలోనే కియారాకు మరో ఆసక్తికరమైన ఆఫర్ వచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఓ డిఫరెంట్ బాలీవుడ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఆమెకు దక్కినట్లు సమాచారం. 2016లో విడుదలైన 'కి అండ్ కా' అప్పట్లో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాల్లో భర్త ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించడం, భార్య ఇంటి బాధ్యతలను చూసుకోవడం వంటి కథలను చూస్తుంటాం. అయితే 'కి అండ్ కా' మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

వివరాలు

ఆకట్టుకున్న సినిమా..

ఈ సినిమాలో కరీనా కపూర్‌ కెరీర్‌పై దృష్టి పెట్టే మహిళగా నటించగా.. అర్జున్ కపూర్ ఇంటి బాధ్యతలు చూసుకునే పురుషుడి పాత్రలో కనిపించారు.

ఆర్. బాల్కి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత 'కి అండ్ కా'కు సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే మొదటి భాగం కథను కొనసాగించకుండా.. అదే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని పూర్తిగా కొత్త కథతో రెండో భాగాన్ని రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

అందుకే ఈ సినిమాలో కొత్త హీరో, హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వివరాలు

కియారా ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీ..

ఈ నేపథ్యంలో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీ పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఆమెను సంప్రదించగా.. కథపై కియారా కూడా ఆసక్తి చూపినట్లు బాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పటివరకు ఆమె ఈ సినిమాకు అధికారికంగా సంతకం చేయలేదని తెలుస్తోంది.

తుది నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉంది. మరోవైపు హీరో పాత్రకు సరిపోయే నటుడి కోసం కూడా మేకర్స్ అన్వేషణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

కియారా ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. యశ్‌తో కలిసి నటించిన 'టాక్సిక్' తర్వాత ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది.

ADVERTISEMENT

వివరాలు

ఏడాది చివరి నాటికి 'కి అండ్ కా 2' షూటింగ్..

అన్నీ అనుకున్నట్లు జరిగితే 'కి అండ్ కా 2' షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఇందులో హీరో ఎవరనేది, కియారా అద్వానీ ఈ ప్రాజెక్ట్‌కు సంతకం చేస్తారా లేదా అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రీ ప్రొడక్షన్ పనులు ముందుకు సాగుతున్న కొద్దీ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మొత్తంగా 'టాక్సిక్' తర్వాత కియారా అద్వానీకి మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ దక్కే అవకాశం కనిపిస్తోంది.

దాదాపు పదేళ్ల తర్వాత 'కి అండ్ కా' సీక్వెల్ తెరకెక్కనుండటం ఒక ఆసక్తికరమైన అంశమైతే.. అందులో కియారా హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందనే వార్త మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.

ADVERTISEMENT