
Kiara Advani: కియారా అద్వానీ మేట్ గాలాలో మెరుపులు.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
తెలుగు ప్రేక్షకులకు 'భరత్ అనే నేను' సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, అనంతరం 'వినయ విధేయ రామ'లో రామ్ చరణ్ సరసన నటించి మంచి గుర్తింపు పొందింది.
బాలీవుడ్‌లో వరుసగా హిట్ చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ స్థానం ఏర్పర్చుకుంది. ప్రస్తుతానికి భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.
ఇక కియారా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడి గతంలో వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ జంటను అభిమానులు తెగ అభిమానిస్తుంటారు.
Details
గౌన్ లో మెరిసిపోయిన కియరా అద్వానీ
తాజాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్‌గా పేరుగాంచిన మెట్ గాలా 2025 న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఘనంగా ప్రారంభమైంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ, ఫ్యాషన్, సంగీత రంగానికి చెందిన ప్రముఖులు ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. భారత సినీ తారలు కూడా ఈ వేడుకలో ఆకట్టుకున్నారు.
ఈ ఏడాది తొలిసారి మెట్ గాలా కార్యక్రమానికి హాజరైన సెలబ్రిటీల్లో కియారా అద్వానీ ఒకరు. గర్భవతిగా ఉన్న కియారా, ఈ కార్యక్రమానికి బేబీ బంప్‌తో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రఖ్యాత భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన డిజైనర్ గౌన్‌లో ఆమె మెరిసిపోయింది.
ఆమె లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీల ఫొటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.