Page Loader
K-RAMP: కొత్త లుక్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. 'కె-ర్యాంప్' గ్లింప్స్‌కు ప్రేక్షకుల ఫిదా
కొత్త లుక్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. 'కె-ర్యాంప్' గ్లింప్స్‌కు ప్రేక్షకుల ఫిదా

K-RAMP: కొత్త లుక్‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. 'కె-ర్యాంప్' గ్లింప్స్‌కు ప్రేక్షకుల ఫిదా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2025
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నటిస్తున్న తాజా చిత్రం 'కె-ర్యాంప్' (K-RAMP) శరవేగంగా రూపొందుతోంది. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా కథానాయికగా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుదలైన కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కి మంచి స్పందన లభించగా, తాజాగా చిత్ర బృందం ఒక గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది.

Details

ఆక్టోబర్18న విడుదల

చిత్రానికి సంగీతాన్ని చేతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. కిర‌ణ్ అబ్బవరం - చేతన్ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం కావడం విశేషం. గతంలో వీరి కాంబోలో 'ఎస్‌ఆర్ కళ్యాణమండపం', 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రాలు విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇక 'కె-ర్యాంప్' చిత్రాన్ని అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా వినోదంతో కూడిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.