LOADING...
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్..
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్..

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

'క' సినిమాతో హిట్ అందుకుని మంచి ఫామ్‌ను అందుకున్న కిరణ్ అబ్బవరం, తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త సినిమాకి టైటిల్‌తో పాటు గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు బేబీ చిత్ర నిర్మాత SKN నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే, బేబీ దర్శకుడు సాయి రాజేష్ అందించిన కథను రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొత్త చిత్రానికి 'చెన్నై లవ్ స్టోరీ' అనే టైటిల్‌ను పెట్టారు.ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

వివరాలు 

చెన్నై నేపథ్యంతో రూపొందిన మరో కొత్త తరహా ప్రేమకథ

విడుదల చేసిన గ్లింప్స్‌లో కిరణ్ అబ్బవరం,గౌరీ ప్రియా చెన్నైలోని బీచ్ ఒడ్డున కూర్చొని ప్రేమ విషయాలపై చర్చించుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ దృశ్యాల్ని చూస్తుంటే,చెన్నై నేపథ్యంతో రూపొందిన మరో కొత్త తరహా ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అనే అంచనాలు వస్తున్నాయి. ఈ గ్లింప్స్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్