
Kiran Abbavaram: 'కె-ర్యాంప్'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కిరణ్ అబ్బవరం
ఈ వార్తాకథనం ఏంటి
కిరణ్ అబ్బవరం హీరోగా కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన 'కె-ర్యాంప్'. ఈ సినిమాలో యుక్తీ తరేజా హీరోయిన్‌గా కనిపించనున్నారు. రాజేశ్ దండ, శివ బొమ్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నరేశ్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2025 దీపావళి సందర్భంగా, ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు వీఐ ఆనంద్, విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమ సమయంలో హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు: కిరణ్ అబ్బవరం
కేవలం వినోదం కోసమే తీసిన సినిమా కె- ర్యాంప్ అని, దీపావళి పండగ పూట కుటుంబంతో కలిసి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారని కిరణ్ అబ్బవరం హామీ ఇచ్చారు. టికెట్‌కు చెల్లించే ప్రతి రూపాయి సంతృప్తికరంగా వినోదం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ సినిమా నవ్వించలేకపోతే తనను ఏమైనా అనవచ్చని సవాల్ విసిరారు. "తనపై నమ్మకంతో సినిమా చూడండి, కడుపుబ్బా నవ్వుతారని నమ్మండి" అని హీరో చెప్పారు. కె- ర్యాంప్ చిత్రానికి కచ్చితంగా సక్సెస్‌మీట్ పెడతాం అని కిరణ్ అబ్బవరం నమ్మకంగా చెప్పారు.