
రూల్స్ రంజన్ ట్రైలర్: కామెడీతో చక్కిలిగింతలు పెట్టడానికి వస్తున్న కిరణ్ అబ్బవరం
ఈ వార్తాకథనం ఏంటి
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. రాతినం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
రూల్స్ రంజన్ ట్రైలర్ మొత్తం కామెడీ సీన్లు, పంచులతో నిండిపోయింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి వెన్నెల కిషోర్, హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష కూడా ఉన్నారు.
నేహా శెట్టి అందాలు సినిమాలో కనువిందు చేయనున్నాయని ట్రైలర్లో చూపించారు. ఓవరాల్ గా ప్రేక్షకులను నవ్వించడమే రూల్స్ రంజన్ టార్గెట్ గా కనిపిస్తోంది.
నిర్మాత AM రత్నం సమర్పణలో రూపొందిన ఈ సినిమా స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తెరకెక్కింది.
అమ్రిష్ సంగీతం అందించిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్రైలర్ విడుదలపై చిత్రనిర్మాణ సంస్థ ట్వీట్
Let's Go on Laughter Ride in theatres🔥😆
— starlightentertainment pvtltd (@starlightenter8) September 8, 2023
Here's the hilariously packed trailer of #RulesRanjann 🥳
▶️ https://t.co/8hmXjPLnJ7
Releasing In Theater's On September 28 ❤️🔥 @Kiran_Abbavaram @iamnehashetty @rathinamkrish @DivyangLavania @AmrishRocks1 pic.twitter.com/Jt7aAQRfdq