Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'దిల్‌రూబా' మూవీ సెకండ్ సింగిల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు ట్రోలింగ్‌కు గురైన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాడు.
గతేడాది అక్టోబర్ చివరి వరకు ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్‌గా మారిపోయింది.
సినిమా ప్రేమికులే కాకుండా, పరిశ్రమలోని కొంత మంది కూడా ఆయన పేరును వినోదపరంగా ఉపయోగించారు.
కట్ చేస్తే... "క" సినిమా విడుదలతో కథే మారిపోయింది!
"క"ఈ సినిమా కిరణ్ అబ్బవరానికి కొత్త ఊపును తీసుకువచ్చింది. ఒకప్పుడు విమర్శలు చేసినవాళ్లే, ఇప్పుడు ఆయన్ను పొగడ్తలతో ముంచేస్తున్నారు.
పాతిక కోట్ల మార్కెట్ కూడా లేని కిరణ్, "క" సినిమాతో ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టి, భారీ విజయం సాధించాడు.
వివరాలు
"దిల్ రూబా"తో మళ్లీ హిట్ కొట్టేందుకు రెడీ!
ఈ ఒక్క హిట్‌తోనే, ఇప్పటివరకు అతనిపై ట్రోలింగ్ చేసినవారి నోళ్లు మూతపడ్డాయి.
కిరణ్ హిట్టు కొట్టడం చూసి, అభిమానులు తమ సొంత వ్యక్తి విజయం సాధించినట్లు సంతోషించారు.
అంతే కాకుండా, అతని సినిమాను థియేటర్‌లో చూసేందుకు గ్యాంగ్‌లుగా వెళ్లేంత స్థాయికి చేరుకున్నారు.
ప్రస్తుతం, కిరణ్ అబ్బవరం రెండు కొత్త సినిమాలను లైనప్‌లో పెట్టుకున్నాడు.
వాటిలో "దిల్ రూబా" ఒకటి.ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ,ఏ యూడ్లీ ఫిలిం కలిసి నిర్మిస్తున్నాయి.
నిర్మాతలుగా రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
వివరాలు
"హే జింగిలి" - మ్యూజికల్ ఫీస్ట్!
ఈరోజు, మేకర్స్ "దిల్ రూబా" రెండో పాట "హే జింగిలి.." లిరికల్ వీడియోగా విడుదల అయ్యింది.
ఇంతకు ముందు విడుదలైన "అగ్గిపుల్లె.." పాటకు భారీ స్పందన వచ్చింది.
"క" సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన హీరో కిరణ్ అబ్బవరం - మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ కాంబినేషన్, "దిల్ రూబా" సినిమాతో మరో మ్యూజికల్ హిట్ అందించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
#HeyJingili from #DilRuba out now
— Vamsi Kaka (@vamsikaka) February 18, 2025
https://t.co/6xvsmD0bL6#DilrubaOnMarch14th @Kiran_Abbavaram @RuksharDhillon pic.twitter.com/NjWxhHYnGZ