Pushpa 2 : 'పుష్ప 2' నుంచి 'కిస్సిక్' ప్రొమో రిలీజ్.. పూర్తి పాట కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లకు వేగం పెంచుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, పాటలు అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా నవంబర్ 24న ఈ చిత్రంలోని మాస్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
Details
ఆరు భాషల్లో రిలీజ్
ప్రోమో పక్కా మాస్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది. అయితే పూర్తి పాట వినేందుకు అభిమానులు రేపటి వరకూ వేచి ఉండాల్సిందే.
ఈ మాస్ సాంగ్‌ను 6 భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రముఖ సింగర్ సుబ్లాషి పాడగా, హిందీలో సుబ్లాషితో పాటు లోహితా జత కట్టారు.
ఇక మలయాళంలో ప్రియా జెర్సన్, బెంగాలీలో ఉజ్జయిని ముఖర్జీ ఆలపించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.