విజయ్ దేవరకొండ కార్ లవ్: విజయ్ గ్యారేజీలో ఉన్న ఈ కార్ల గురించి తెలుసా?
అర్జున్ రెడ్డి సినిమాతో అందనంత ఎత్తుకు ఎదిగిన విజయ్ దేవరకొండ, గీత గోవిందం సినిమాతో ఆకాశాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచినా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటు సినిమాలో స్టార్ గా ఉంటూనే, అటు రౌడీ బ్రాండ్ అంటూ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు విజయ్. విజయ్ కి కార్లంటే చాలా ఇష్టం. అందుకే తన గ్యారేజీలో రకరకాల కార్లు కనిపిస్తాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. వోల్వో ఎక్స్ సి 90: ఇండియాలో అత్యంత సురక్షితమైన కారుగా చెప్పుకునే వోల్వో కంపెనీకి చెందిన కారు విజయ్ గ్యారేజీలో ఉంది. వోల్వో ఎక్స్ సి90 పేరుగల ఈ కారు ధర 90లక్షలకు పైగానే ఉంటుంది.
విజయ్ ఎక్కువగా వాడే కారు
మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ సి: 60లక్షలకు పైగాఎక్కువ ధర కలిగిన ఈ కారును విజయ్ దేవరకొండ ఎక్కువగా వాడతాడని సమాచారం. చూడడానికి అందంగా, అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఈ కారుకు ఇండియాలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ల్యాండ్ రోవర్: ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కారు విజయ్ గ్యారేజీలో ఉంది. దీని ధర 60లక్షలకు పైగానే ఉంటుంది. బీ ఎమ్ డబ్ల్యూ: ఈ కంపెనీకి చెందిన 5సిరీస్ కారును విజయ్ గ్యారేజ్ లో ఉంది. దీని రేటు 60లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఇందులో రకరకాల వేరియంట్లు ఉన్నాయి. అలాగే ఫోర్డ్ కంపెనీకి చెందిన మస్టాన్ అనే కారును విజయ్ కొనుక్కున్నాడు.