Irumudi: 'ఇరుముడి' హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ముద్దుగుమ్మ.. ఎంత పని చేశావ్ అమ్మడు!
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. విడుదలైన 8 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.146 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం రూ.200 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన తమిళ నటి ప్రియా భవానీ శంకర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆమె నటనతో పాటు పాత్రకు కూడా ట్రేడ్ వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ సక్సెస్‌ఫుల్ మూవీలో ప్రియా భవానీ శంకర్ కంటే ముందుగా పలువురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లను హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివరాలు
ఆ ఛాన్స్ వదులుకున్న హీరోయిన్ ఎవరంటే..
శివ నిర్వాణ కథ సిద్ధం చేసిన తర్వాత, ఈ కీలక పాత్ర కోసం ముందుగా ఓ స్టార్ హీరోయిన్‌ను సంప్రదించారట.
గతంలో ఆమె, శివ నిర్వాణ కాంబినేషన్‌లో 'మజిలీ', 'ఖుషి' వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
అయితే కొన్ని కారణాలతో ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం.
ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతార, అనుష్క శెట్టి పేర్లను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది.
గతంలో రవితేజ, అనుష్క కాంబినేషన్‌లో 'విక్రమార్కుడు', 'బలాదూర్' వంటి సినిమాలు వచ్చాయి.
ఈ ప్రాజెక్ట్‌లో అనుష్క నటించి ఉంటే ఆమె కెరీర్‌కు మరో మంచి హిట్ చేరి ఉండేదనే టాక్ వినిపిస్తోంది.
వివరాలు
సినీ వర్గాల్లో చర్చ..
ఇక యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరిని కూడా ఈ పాత్ర కోసం సంప్రదించారట.
అయితే కాల్‌షీట్లు, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె కూడా ఈ గోల్డెన్ ఛాన్స్‌ను వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం.
ఇలా పలువురు స్టార్ హీరోయిన్లు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవడంతో చివరకు ఆ లక్కీ ఛాన్స్ ప్రియా భవానీ శంకర్‌ను వరించింది.
ఇప్పుడు 'ఇరుముడి' భారీ విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్‌లో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.