Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టిందిరో' ప్రోమో విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది.
యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
తాజాగా చిత్రబృందం 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టిందిరో' అనే రెండో లిరికల్ సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది.
ఈ పాటను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్‌తో కూడిన స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
Details
మార్చి 28న రిలీజ్
ఈ గీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రచించగా, ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పాడారు.
మరో ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా, ఏ ఎం రత్నం 'సూర్య మూవీస్' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది.