NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Devara 2: 'దేవర 2' పై అంచనాలు పెంచేసిన కొరటాల.. కథలో అసలు మలుపు ఆ పార్ట్‌ లోనే..
    తదుపరి వార్తా కథనం
    Devara 2: 'దేవర 2' పై అంచనాలు పెంచేసిన కొరటాల.. కథలో అసలు మలుపు ఆ పార్ట్‌ లోనే..
    'దేవర 2' పై అంచనాలు పెంచేసిన కొరటాల

    Devara 2: 'దేవర 2' పై అంచనాలు పెంచేసిన కొరటాల.. కథలో అసలు మలుపు ఆ పార్ట్‌ లోనే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 08, 2024
    01:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'దేవర'ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

    ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్ 2('దేవర 2')వస్తుందని కొరటాల శివ ముందే ప్రకటించారు.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన 'దేవర 2'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు,దీంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి.

    ''పార్ట్ 2లో జాన్వీ కపూర్ పాత్ర అసాధారణంగా ఉంటుంది,అది అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

    మొదటి భాగంతో పోలిస్తే, రెండో భాగం మరింత బాగుంటుందని అన్నారు.ప్రేక్షకులు సినిమా చూస్తుండగా సీట్‌ ఎడ్జికి వచ్చేలా ఉంటుంది.

    దర్శకుడిగా, నాకు పార్ట్ 2పై పూర్తి నమ్మకం ఉంది. కథలో అసలు మలుపు రెండో భాగంలోనే ఉంటుంది. ప్రతి పాత్ర హైలైట్ అవుతుంది.

    వివరాలు 

    పార్ట్ 2 100 శాతం ఆకట్టుకుంటుంది: కొరటాల 

    ఎన్టీఆర్ అభిమానులకు నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే: మీరు పార్ట్ 1లో చూసింది కేవలం 10 శాతం మాత్రమే. పార్ట్ 2 100 శాతం ఆకట్టుకుంటుంది.ప్రతి పాత్రలో ట్విస్టులు ఉంటాయి. కొన్ని సన్నివేశాలు మీ మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ విషయంలో నేను మాట ఇస్తున్నాను. తారక్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు తన పాత్రకు జీవం పోస్తాడు'' అని కొరటాల శివ అన్నారు.

    ఇటీవల ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కూడా 'దేవర 2' గురించి మాట్లాడారు.

    వివరాలు 

    త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్‌లో దేవర 

    మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్ 2లోని కొన్ని సన్నివేశాలు షూట్‌ చేసినట్లు చెప్పారు.

    మొదటి భాగం విజయం సాధించడంతో వారి బాధ్యత మరింత పెరిగిందని, సీక్వెల్‌ 'దేవర' కంటే ఇంకా గొప్పగా ఉంటుందని చెప్పారు.

    కథ సిద్ధంగా ఉందని, కొద్దిగా మెరుగులు దిద్దాల్సి ఉందన్నారు. కొరటాల శివ 'దేవర' కోసం ఎంతో కష్టపడినట్లు ఎన్టీఆర్ తెలిపారు.

    సెప్టెంబర్ 27న విడుదలైన 'దేవర' ఇప్పటివరకు రూ.466 కోట్ల వసూళ్లు సాధించగా, త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దేవర

    తాజా

    operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Sunil Gavaskar: 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌, విరాట్‌ ఆడరు: సునీల్‌ గావస్కర్‌ సునీల్ గవాస్కర్
    CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొండి ఇలా.. సీబీఎస్‌ఈ
    China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అవుతారు: జిన్‌పింగ్‌ జిన్‌పింగ్

    దేవర

    Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్ జూనియర్ ఎన్టీఆర్
    Devara 3rd Song: ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో సర్ప్రైజ్.. మూడో సాంగ్ ఎప్పుడొచ్చినా భీభత్సమే అంటూ హింట్  జూనియర్ ఎన్టీఆర్
    Devara: 'దేవర' ఫీవర్.. ఎన్టీఆర్‌ మూవీకి ఓవర్సీస్‌లో భారీ స్పందన  జూనియర్ ఎన్టీఆర్
    Devara: 'దేవర' నుండి కీలక అప్డేట్..  ఎల్లుండే మూడవ సింగిల్  'దావూది'  విడుదల  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025