
Kotabommali PS: కోట బొమ్మాళి P.S రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన కోటబొమ్మాళి పీఎస్ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాకు తేజా మార్నీ డైరక్ట్ చేశాడు.
మలయాళంలో విజయవంతమైన నయట్టు రిమేక్‌గా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌కి కనెక్టు అయ్యిందో లేదో చూద్దాం.
పోలీస్ వ్యవస్థలో లోటుపాట్లు తెలిసిన హెడ్ కానిస్టేబుల్ గా శ్రీకాంత్(రామకృష్ణ) పనిచేస్తుంటాడు.
తన పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ పెళ్లికి వెళ్లి వస్తున్న సమయంలో రామకృష్ణ చేసిన యాక్సిడెంట్ వల్ల ఓ వ్యక్తి చనిపోతాడు.
ఆ సమయంలో అక్కడ ఉపఎన్నికలు జరుగుతుండంతో ఆ హత్య రాజకీయ రంగు పులుముకుంటుంది. ఆ సమయంలో రామకృష్ణ అక్కడి నుంచి పారిపోతాడు.
Details
ఎమోషనల్ గా సాగిన క్లైమాక్స్
అసలు ఆ వ్యక్తి యాక్సిడెంట్‌లోనే చనిపోయాడా? రామకృష్ణ దొరకుండా ఎలాంటి ఎత్తులు వేశాడో అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
రీమేక్ సినిమానే అయినా ఆ ఫీలింగ్ రాకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడనే చెప్పాలి.
ముఖ్యంగా శ్రీకాకుళం యాస, ఆ నేటివిటీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి.
క్లైమాక్స్ ఎమోషనల్‌గా ముగుస్తుంది. లింగి లింగిడి పాట విషయంలో దర్శకుడు తెలివిగా మ్యానేజ్ చేశాడు.
శ్రీకాంత నట, కథా నేపథ్యం, ట్విస్టులు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.