LOADING...
kotha lokah OTT: ఇట్స్ అఫిషియల్ ఓటీటీలోకి 'కొత్తలోక'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ఇట్స్ అఫిషియల్ ఓటీటీలోకి 'కొత్తలోక'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

kotha lokah OTT: ఇట్స్ అఫిషియల్ ఓటీటీలోకి 'కొత్తలోక'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్న చిత్రంగా విడుదలైనప్పటికీ భారీ వసూళ్లను సాధించిన చిత్రం 'కొత్తలోక: చాప్టర్‌ 1'. కేవలం ప్రేక్షకుల మౌత్‌ టాక్‌తోనే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వందల కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూశారు. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. జియోహాట్‌స్టార్‌ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసి, అక్టోబర్‌ 31 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, తమిళ, హిందీ, బెంగాళీ, మరాఠీ భాషల్లో కూడా వీక్షించవచ్చని ఓ పోస్టర్‌లో వెల్లడించారు.

వివరాలు 

ఇంతకీ కథేంటంటే.. 

చంద్ర, అలియాస్ నీలి (కల్యాణి ప్రియదర్శన్) అతీంద్రియ శక్తులతో కలిగిన యువతి. ఒక మిషన్‌లో ఆమెను శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. ఈ సంఘటన తర్వాత, చంద్ర స్వీడన్‌ నుంచి బెంగళూరుకు మారి, తన గురించి ఎవరికీ తెలియకుండా ఒక కేఫ్‌లో పనిచేస్తూ ఉంటుంది. ఆ కేఫ్‌ పక్కింట్లో ఉండే సన్నీ (నస్లేన్) ఆమెతో స్నేహాన్ని పెంచుకుంటాడు. ఇక మరోవైపు ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ (శాండి మాస్టర్) అతని బాస్‌ మానవ అవయవాల అక్రమ రవాణా చేస్తుంటారు. చంద్రను అనుకోకుండా చూసిన నాచియప్పకు ఆమెపై సందేహాలు రావడం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో, చంద్ర నిజంగా ఎవరు, ఆమెను చూసి సన్నీ ఎందుకు అంతగా భయపడ్డాడు? అనేది చిత్ర కథ.

వివరాలు 

కలెక్షన్ల వర్షం.. 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం భారీ వసూళ్లను సాధించడమే కాదు, ఇది అత్యధిక వసూళ్లను రాబట్టిన తొలి మలయాళీ చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన 'ఎల్2: ఎంపురాన్' ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు (రూ.265.5 కోట్లు) రాబట్టిన చిత్రంగా ఉండేది. ఆ రికార్డును ఈ చిత్రం బద్దలు కొట్టింది. డొమినిక్‌ అరుణ్‌ దర్శకత్వంలో ఈ మూవీ కేవలం రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. విడుదలైన 40 రోజుల్లో రూ. 300 కోట్ల గ్రాస్‌ కలెక్షన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జియోహాట్‌స్టార్‌ చేసిన ట్వీట్