Page Loader
Actress Injured: జిమ్‌లో గాయపడిన ప్రముఖ నటి.. క్లినిక్‌ నుండి షేర్ చేసిన ఫోటోలు వైరల్ 
జిమ్‌లో గాయపడిన ప్రముఖ నటి.. క్లినిక్‌ నుండి షేర్ చేసిన ఫోటోలు వైరల్

Actress Injured: జిమ్‌లో గాయపడిన ప్రముఖ నటి.. క్లినిక్‌ నుండి షేర్ చేసిన ఫోటోలు వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2024
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై' వంటి ప్రముఖ సీరియల్స్‌లో కనిపించిన క్రిస్టల్ డిసౌజాకు సంబంధించిన పెద్ద వార్త బయటకు వచ్చింది. జిమ్‌లో వర్కవుట్‌ చేస్తుండగా ఆమె గాయపడింది. మోకాలిలో విపరీతమైన నొప్పి రావడంతో వెంటనే క్లినిక్‌కి తీసుకెళ్లి అక్కడ నుంచి తన ఫొటోలను షేర్ చేసి హెల్త్ అప్‌డేట్ ఇవ్వడంతో వైరల్ అవుతోంది. 2007లో 'కహెన్ నా కహెన్' సినిమాతో నటనా రంగంలోకి అడుగుపెట్టిన క్రిస్టిల్ డిసౌజాతో ఏప్రిల్ 20న ఈ సంఘటన జరిగింది. రోజూలాగే ఆదివారం కూడా వర్కవుట్ చేయడానికి జిమ్‌కి వెళ్లింది. అకస్మాత్తుగా ఆమెకి మోకాళ్ల సమస్యలు వచ్చాయి. దీని తరువాత, తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది.

Details 

వధేరా పాత్రతో గుర్తింపు 

ఇక ఈ నేపథ్యంలోక్రిస్టల్ టైమ్స్ నౌ/టెల్లీ టాక్ ఇండియాతో మాట్లాడుతూ, 'జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు నా మోకాలికి గాయమైంది.' ఇక వెంటనే వైద్యం కోసం క్లినిక్‌కి తీసుకెళ్లారు అని పేర్కొంది. ఇక ఇప్పుడు ఆమె కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటికే కొంత ఉపశమనం లభించిందని.. అయితే తనకు మందులు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు కానీ ఈ సమయంలో తినక తప్పడం లేదని ఆమె ఇంస్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది. క్రిస్టల్ 'ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై' సీరియల్‌లో జీవికా వధేరా పాత్రను పోషించడం ద్వారా గుర్తింపు పొందింది. ఇది కాకుండా, ఆమె 'ఏక్ నయీ పెహచాన్', 'బెలన్ వాలీ బహు' వంటి షోలలో కనిపించింది.