LYCA : 'ఎల్2 ఎంపురాన్' రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ ఓపెనింగ్‌కు ముస్తాబైన మోహన్ లాల్ మూవీ!
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'లూసిఫర్' (2019) మలయాళ సినీ పరిశ్రమలో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా 'ఎల్2 ఎంపురాన్' తెరకెక్కింది.
ఇప్పటికే విడుదలైన 'ఎల్2 ఎంపురాన్' గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన 'ఎల్2 ఎంపురాన్'
భారీ అంచనాల నడుమ 'ఎల్2 ఎంపురాన్' సినిమాను మార్చి 27న పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
Details
మార్చి 27న రిలీజ్
ఇటీవల, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన 'ఇండియన్ 2' భారీ డిజాస్టర్‌గా మిగిలింది. అలాగే 'విదాముయార్చి' కూడా యావరేజ్‌గా నిలిచింది.
దీంతో ఈ రెండు సినిమాల బయ్యర్స్ భారీ నష్టాలు చవిచూశారు. ఇప్పుడు ఎంపురాన్ లాభాలతో ఆ నష్టాలను భర్తీ చేయాలని, లేకపోతే సినిమాను విడుదల చేయనివ్వమని బయ్యర్స్ ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
అయితే లైకా ప్రొడక్షన్స్ దీనిపై స్పష్టత ఇస్తూ, 'ఎంపురాన్' విడుదల విషయంలో ఎటువంటి సమస్యలు లేవని, మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ప్రకటించింది.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన 'ఎల్2 ఎంపురాన్' మాలీవుడ్‌లో రికార్డు ఓపెనింగ్ రాబట్టే సినిమాగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసే అవకాశముంది.