LOADING...
Laapata Ladies Oscars 2025 : 2025 ఆస్కార్‌కు ఎంపికైన  'లాపతా లేడీస్'  
2025 ఆస్కార్‌కు ఎంపికైన 'లాపతా లేడీస్'

Laapata Ladies Oscars 2025 : 2025 ఆస్కార్‌కు ఎంపికైన  'లాపతా లేడీస్'  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన "లాపతా లేడీస్" అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ చిత్రం 2025 ఆస్కార్‌కు భారతదేశం నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ సమాచారాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వివరాలు 

ఆమె మాట నిజం అయ్యింది 

ఇటీవల, ఈ విషయంపై"లాపతా లేడీస్" మూవీ డైరెక్టర్ కిరణ్ రావ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో, ఈ సినిమా తప్పక Oscars‌కు ఎంపిక అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.2025 ఆస్కార్ అవార్డుల్లో భారత్ తరఫున అఫీషియల్ నామినేషన్‌కు "లాపతా లేడీస్" అర్హత సాధిస్తుందని, ఆ మూవీ మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ చిత్రాన్నిఆస్కార్‌కు పంపుతుందని తాను నమ్ముతున్నానని అన్నారు. ఇప్పుడు, నామినేషన్ల ప్రకటన విన్న మూవీ లవర్స్ సంతోషంతో, కిరణ్ మాట నిజమైందని వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పల్లెటూరికి చెందిన ఇద్దరు కొత్త పెళ్లి కూతుర్లు తమ అత్తారింటికి వెళ్ళే సమయంలో రైలులో అనుకోకుండా తారుమారైపోతారు.

వివరాలు 

సుప్రీంకోర్టు 75ఏళ్ల వేడుకల్లో కూడా ప్రత్యేక ప్రదర్శన 

పెళ్లికొడుకులు ఈ విషయాన్ని గమనించకుండా ఆ అమ్మాయిలను ఇంటికి తీసుకువెళ్తారు. తర్వాత అసలు సత్యం బయటపడుతుందనేదే మిగతా కథ. ఈ మార్పు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది కధాంశం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన సొంత బ్యానర్‌లో నిర్మించారు.ఇది ఇప్పటికే అనేక ప్రశంసలు, గుర్తింపు పొందింది. గతంలో,టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో కూడా ఈ సినిమా ప్రదర్శించబడింది. అంతే కాకుండా,సుప్రీంకోర్టు 75ఏళ్ల వేడుకల్లో కూడా ప్రత్యేక ప్రదర్శన జరిగింది. అలాగే, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్(IFFM)లో క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్ అవార్డును కూడా పొందింది.