మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: లేడీ లక్ పేరుతో మంచి మెలోడీ సాంగ్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నుండి లేడీ లక్ సాంగ్ రిలీజైంది.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి నో నో నో, హతవిధీ అనే రెండు పాటలు విడుదలయ్యాయి. లేడీ లక్ అనేది మూడవ పాట. మొదటి రెండు పాటల్లో ప్రేమ, ఇష్టం అన్న కాన్సెప్ట్ ఉండదు. ఆ లోటును మూడవ పాట తీర్చిందని చెప్పాలి.
ఎందుకంత ఇష్టం నేనంటే, ఎందులోన గొప్ప నీకంటే అంటూ సాగే ఈ పాట, హాయిగా పాడుకునేలా ఉంది. ఇది ప్యూర్ లవ్ సాంగ్ అయినా పాటలో మాత్రం హీరో వైపు నుండి మాత్రమే ప్రేమ కనిపిస్తుంది.
Details
నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా
ఈ పాట విజువల్స్ లో మాత్రం హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఉన్నట్టుగా చూపించారు. అనుష్క పాత్ర నవీన్ పాత్ర జీవితంలోకి రావడం వల్ల అదృష్టం కలిసి వచ్చిందని పాటలో చూపించారు.
రాధన్ అందించిన సంగీతం హాయిగా ఉంది. రామజోగయ్య రాసిన సాహిత్యం అద్భుతంగా కనిపించింది. కార్తీక్ గొంతువల్ల పాట మరింత అందంగా వినిపించింది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఆగస్టు 14న తెలుగు, తమిళం, కన్నడ మళయాలం భాషల్లో రిలీజ్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నుండి లేడీ లక్ సాంగ్ రిలీజ్
Presenting the FULL VIDEO of the love song from #MissShettyMrPolishetty . This one is for all the lovely ladies ❤️❤️ @radhanmusic’s sweetest love song after Chitti. Sing and dance with your #LadyLuck. Hope you like it ❤️https://t.co/Nm52LmFfGr@MsAnushkaShetty @UV_Creations… pic.twitter.com/i9N4yActMv
— Naveen Polishetty (@NaveenPolishety) July 10, 2023