Laila OTT: ఆహాలో 'లైలా'.. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
లేడీ గెటప్‌లో కనిపించిన విశ్వక్ సేన్ నటించిన 'లైలా' చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటిటిలో విడుదలకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా' (Aha)లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆహా, 'లైలా'తో ప్రేమలో పడండి' అంటూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది.
Details
కథా సారాంశం ఇదే
సోనూ మోడల్ అలియాస్ సోనూ (విశ్వక్ సేన్) హైదరాబాదులోని ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు.
తన మేకప్ టాలెంట్ చూసి మహిళలు అతన్ని ఎంతో ఇష్టపడతారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సోనూ, ఆమె నేర్పిన కళతో పార్లర్ నిర్వహిస్తూ, బాధితులను ఆదుకుంటుంటాడు.
అనుకోకుండా అతను ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పారిపోవాలని స్నేహితులు సూచిస్తారు.
కానీ, సోనూ భిన్నంగా ఆలోచించి లైలా అనే అమ్మాయిగా రూపాంతరం చెందతాడు.
అతను ఎంత కాలం లైలా రూపంలో తిరిగాడు? చివరికి అతను అమ్మాయి కాదని నిజం బయటపడిన తర్వాత ఏమైంది? అనే ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే, ఈ సినిమాను చూడాల్సిందే.