Laapataa Ladies: ఆస్కార్‌కు నామినేట్ అయిన 'లాపతా లేడీస్'.. కథలో ఉన్న ట్విస్టులివే!
చిన్న సినిమా.. పెద్ద విజయం సాధించింది. చక్కటి కథ, భిన్నమైన హాస్యంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. యానిమల్, కల్కి, మైదాన్, ఆర్టికల్-370 లాంటి సినిమాలతో పోటీపడి ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ చిత్రమే 'లా పతా లేడిస్'. ఇంతకు కథలో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపక్ అనే రైతు తన కొత్త భార్యతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తాడు. అయితే ఆ రైల్లో నవ వధువులు చాలామంది ఉంటారు. అయితే రైల్లోని నవ వధువుల మధ్యలో తారుమారయ్యి, చివరికి వేరే వధువుతో ఇంటికి చేరుకుంటాడు. తన అసలు భార్య కోసం చేసే ప్రయత్నాల కథే ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌గా నిలిచింది.
సాధారణ కథతోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన 'లాపతా లేడిస్'
తమిళనాడులోని రైల్వే స్టేషన్‌లో తలదాచుకుంటున్న అసలు భార్యను తిరిగి కనిపెట్టే యాత్రలోని హాస్య, భావోద్వేగం కలగలిసిన కథను ఆసక్తికరంగా చూపించిన కిరణ్ రావు దర్శకత్వం ఈ సినిమా ప్రత్యేకతగా ఆకర్షణగా నిలిచింది. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో పాటు, మహిళా సాధికారత, మానవత్వం వంటి అంతర్లీన అంశాలను చర్చించిన ఈ సినిమా సాధారణ కథతోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం ఏకంగా ఆస్కార్ నామినేషన్ సాధించింది.