Page Loader
Pawan Kalyan : మార్క్ శంకర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. వైద్యులు ఏం చెప్పారంటే?
మార్క్ శంకర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. వైద్యులు ఏం చెప్పారంటే?

Pawan Kalyan : మార్క్ శంకర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. వైద్యులు ఏం చెప్పారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ అధికారిక వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు వెళ్లారు. అక్కడి ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న తన కుమారుడిని చూడటానికి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు.

Details

సింగపూర్ వెళ్లిన మెగాస్టార్ దంపతులు

చేతులు, కాళ్లపై కాలిన గాయాలతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చొచ్చుకుపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు తెలిపారు. అయితే మార్క్ పరిస్థితి స్థిరంగా ఉందని, ఊపిరితిత్తులపై దృష్టిపెట్టి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం మార్క్‌ను ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్టు తెలియజేశారు. వచ్చే మూడు రోజులు అతని ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తామని వైద్యులు వెల్లడించారు. మరోవైపు పవన్ కుమారుడిని పరామర్శించేందుకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా సింగపూర్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మార్క్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.