
ఓజీ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్: ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఓజీ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
తాజాగా ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది. ఇటీవల హైదరాబాద్ లో మూడవ షెడ్యూల్ మొదలయిందని ఓజీ టీమ్ ప్రకటించింది. ప్రస్తుతం మూడవ షెడ్యూల్ పూర్తయినట్లు తన సోషల్ అకౌంట్ ద్వారా తెలియజేసింది.
అంతేకాదు, ఈ మూడవ షెడ్యూల్ తో ఓజీ సినిమా సగభాగం చిత్రీకరణ పూర్తయిందని చెప్పుకొచ్చింది. దాంతో అభిమానులు ఎక్సైట్ అవుతున్నారు. అదే టైంలో ఆశ్చర్యపోతున్నారు.
మొన్ననే మొదలై అప్పుడే సగం అయిపోయిందా అని అవాక్కవుతున్నారు. ఓజీ స్పీడ్ చూస్తుంటే ఈ సంవత్సరంలోనే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓజీ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్
Action, Epicness & Drama…
— DVV Entertainment (@DVVMovies) June 26, 2023
A very productive three Schedules Done & Dusted. #OG Completes 50% of the shoot. Exciting weeks ahead 🤙🏻🔥#FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/x2wkRvLkgB