Page Loader
Dhandoraa : లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ 'దండోరా' మూవీ ప్రారంభం
లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ 'దండోరా' మూవీ ప్రారంభం

Dhandoraa : లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ 'దండోరా' మూవీ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 11, 2024
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేష‌న‌ల్ అవార్డ్‌ను సాధించిన చిత్రం 'క‌ల‌ర్ ఫోటో', బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'బెదురులంక 2012' సినిమాలు టాలీవుడ్‌లో మంచి పేరు పొందాయి. ఈ మూవీలను లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించాయి. ప్రస్తుతం ఆ సంస్థ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని మరో సినిమాను రూపొందించనున్నారు. 'దండోరా' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మం ఈ బుధ‌వారం ఫిల్మ్‌న‌గర్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్య‌క్ర‌మంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టారు. బేబీ నిర్మాత ఎస్ కె ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.

Details

త్వరలోనే మరిన్ని వివరాలు

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను సృజనాత్మకంగా ప్రదర్శిస్తూనే, వ్యంగ్యంతో పాటు హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలను కూడా చూపించనున్నారు. విలక్షణ నటుడు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మానీక్ చిక్కాల, అనూష వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రఫీ, గ్యారీ బి. హెచ్ ఎడిటింగ్, క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంపై మరిన్ని వివరాలు త్వరలో విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.