LOADING...
Lavanya Tripathi : మొదటిసారి బేబీ బంప్ ఫొటోతో మెగా కోడలు.. వైరల్ అవుతున్న పండగ స్పెషల్ పిక్ 
వైరల్ అవుతున్న పండగ స్పెషల్ పిక్

Lavanya Tripathi : మొదటిసారి బేబీ బంప్ ఫొటోతో మెగా కోడలు.. వైరల్ అవుతున్న పండగ స్పెషల్ పిక్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ జీవితం ఫ్యాన్స్‌కి ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ జంట ఆరేళ్ల సైలెంట్ ప్రేమ తర్వాత 2023లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత ఇద్దరూ సినిమాలు కొనసాగిస్తూ హ్యాపీగా జీవితం ఆస్వాదిస్తున్నారు. ఫ్యాన్స్ కోసం ట్రిప్స్‌లో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల,మే నెలలో,లావణ్య త్రిపాఠి గర్భవతిగా ఉన్న విషయాన్ని ఈ జంట అధికారికంగా ప్రకటించింది.

వివరాలు 

వరుణ్,లావణ్య కలిసి పూజలో పాల్గొన్న ఫోటో

ఆ తర్వాత కొంతకాలం లావణ్య మీడియా ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి లావణ్య బేబీ బంప్‌తో ఫొటోలో కనిపించారు. వినాయక చవితి సందర్భంగా,ఇంట్లో వినాయకుని పూజ చేసి,వరుణ్,లావణ్య కలిసి పూజలో పాల్గొన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో స్పష్టంగా లావణ్య బేబీ బంప్ తో కనిపిస్తున్నారు. ఈ ఫొటో ఫ్యాన్స్‌కి చాలా ఆకర్షణీయంగా మారి వైరల్ అయ్యింది. త్వరలో ఈ జంట తల్లితండ్రులు అవుతారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో లావణ్య  షేర్ చేసిన ఫోటో ఇదే..