Lavanya Tripathi Birthday: హ్యాపీ బర్త్ డే అందాల రాక్షసి.. అందం, అభినయం లావణ్య త్రిపాఠి సొంతం
ఈ వార్తాకథనం ఏంటి
పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) సొంతం. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
తన క్యూట్‌నెస్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. 'అందాల రాక్షసి', 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్నినాయనా', 'శ్రీరస్తు శుభమస్తు','అర్జున్ సురవరం', లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ప్రేక్షకుల మెప్పును పొందిన మెగా కోడలు లావణ్య పుట్టిన రోజు ఈ రోజు.. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది అందమైన అభినయం ఉన్న హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి కూడా ఉంటుంది.
నాని, మారుతి కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.
Details
2006లో మిస్ ఉత్తరాఖండ్'గా ఎంపికైన లావణ్య త్రిపాఠి
ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడ్డ ఈ చిన్నది ఇటీవలే ఇటలీ వేదికగా వరుణ్‌తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది.
లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్15న ఉత్తరప్రదేశ్‌లో జన్మించింది.
2006లో మిస్ ఉత్తరాఖండ్‌గా ఎంపికైంది. తాను హీరోయిన్ కావడానికి అలనాటి తారలు శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లే స్ఫూర్తిని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌తో కలిసి హనీమూన్ కోసం అర్కిటిక్‌కు వెళ్లినట్లు తెలిసింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.