LOADING...
Lawrence: లారెన్స్ దాతృత్వం.. దివ్యాంగురాలికి కృత్రిమ కాలు, సొంత ఇల్లు బహుమతి
లారెన్స్ దాతృత్వం.. దివ్యాంగురాలికి కృత్రిమ కాలు, సొంత ఇల్లు బహుమతి

Lawrence: లారెన్స్ దాతృత్వం.. దివ్యాంగురాలికి కృత్రిమ కాలు, సొంత ఇల్లు బహుమతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ, తెలుగు సినీ ప్రేక్షకులకు రాఘవ లారెన్స్‌ పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ సహాయం నెట్టింట్లో చర్చనీయాంశమైంది. పేదరికంలో జీవిస్తున్న శ్వేత అనే దివ్యాంగురాలు అనారోగ్యం కారణంగా నడవలేని స్థితికి చేరుకుంది. ఆమె సమస్యను తెలుసుకున్న లారెన్స్ ముందుగా వీల్‌చైర్ స్కూటీని బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా, శ్వేత తిరిగి నడిచేలా కృత్రిమ కాలును ఏర్పాటు చేయించి, కావాల్సిన వైద్య సహాయం అందించారు. అదికాకుండా, ఆమెకు సొంత ఇల్లు కట్టించడమే తన తదుపరి లక్ష్యం అని లారెన్స్ ప్రకటించారు.

Details

హ్యాట్సాఫ్ అన్నా అంటూ కామెంట్లు

ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ 'హ్యాట్సాఫ్ లారెన్స్ అన్నా' అంటూ కొనియాడుతున్నారు. ఒకవైపు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న లారెన్స్, మరోవైపు తన సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' సిరీస్ ఇప్పటికే వరుస విజయాలను సాధించింది. ఇక ఇప్పుడు ఈ సిరీస్‌లో కొత్త అధ్యాయం 'కాంచన 4'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలక పాత్రలో నటిస్తోందట.

Details

చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు

ఆమె దెయ్యం పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్టు సమాచారం. లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హారర్, హ్యూమర్, ఎమోషన్‌తో పాటు గ్లామర్‌కూ పెద్ద పీట వేస్తున్నారని తెలుస్తోంది. లారెన్స్ స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడంతో పాటు, క్యాన్సర్ బాధిత చిన్నారులకు ఉచిత వైద్యం కల్పిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడం, తన సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన రైతులకు ట్రాక్టర్లు బహుమతిగా ఇచ్చిన విషయం కూడా విశేషంగా నిలిచింది.