
గుంటూరు కారం షూటింగ్ లోంచి ఫోటో లీక్: రాజకీయ అంశాలతో ఉండనున్న సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఇటీవల యాక్షన్ సీన్లతో కూడిన షెడ్యూల్ ని పూర్తి చేసినట్టు సమాచారం. అయితే గుంటూరు కారం సెట్స్ లోంచి ప్రస్తుతం ఒక ఫోటో లీకైంది.
ఈ ఫోటోలో నటుడు ప్రకాష్ రాజ్ పాత్రకు సంబంధించిన ఫ్లెక్సీ ఉంది.
ఆ ఫ్లెక్సీ పైన, ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి వైర వెంకట స్వామిగారికి జన్మదిన శుభాకాంక్షలు, జనదళం పార్టీ యువ నాయకులు నిజామాబాద్ జిల్లా అని రాసి ఉంది. దీంతో సినిమాలో పొలిటికల్ యాంగిల్ ఉండనుందని అంటున్నారు.
Details
హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి
లీకైన పోస్టర్ లో కేవలం ఫ్లెక్సీ మాత్రమే ఉండడం, అదీగాక గుంటూరు ప్రాంత నేపథ్యంలో గుంటూరు ప్రాంత నేపథ్యంలో సాగే సినిమాలో నిజామాబాద్ జిల్లాకు సంబంధం ఏంటనేది అర్థం కావట్లేదు.
ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే చిత్రబృందం స్పందించాల్సిందే.
గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ ఆదరించేలా యాక్షన్ సన్నివేశాలతో త్రివిక్రమ్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట.
అనుకున్నట్లుగా అన్నీ కుదిరితే 2024 జనవరి 13వ తేదీన గుంటూరు కారం రిలీజ్ అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గుంటూరు కారం షూటింగ్ నుండి ఫోటో లీక్
#GunturKaaram pic.twitter.com/McedNKTyBs
— 𝕾𝖗𝖎𝖐𝖆𝖓𝖙𝖍 𝕯𝕳𝕱𝕸 ❤️🔥 (@urstruly_srii) July 18, 2023