Game Changer : గేమ్ ఛేంజర్ సెట్స్ నుండి కీలక సన్నివేశం లీక్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల, ఈ చిత్రం షూటింగ్ వైజాగ్‌లోని ఆర్‌కె బీచ్‌లో స్టార్ట్ అయ్యింది.
అయితే, ఈ సినిమా కోసం బీచ్ లో ఔట్ డోర్ సెట్ వేసి.. రామ్ చరణ్, కియార, ఎస్.జే సూర్య, నవీన్ చంద్రలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
లీక్ అయ్యిన వీడియోలో రామ్ చరణ్ క్లీన్ షేవ్ చేసుకుని, నీట్ గా టక్ చేసుకొని ఉన్నారు. అలానే కియారా చీర కట్టులో హుందాగా కనిపిస్తోంది.
Details
రామ్ చరణ్ సెకండ్ లుక్ రివీల్
పొలిటీషియన్ గా ఎస్.జె. సూర్య, శ్రీకాంత్,నవీన్ చంద్ర కనిపిస్తున్నారు. ఈ లీకుల కారణంగా రామ్ చరణ్ సెకండ్ లుక్ రివీల్ అయింది.
అలానే ప్రధాన పాత్రలు పోషిస్తున్న కీయారా అద్వానీ, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్రల పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా బయటకి వచ్చాయి.
భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2024 క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న దీనిపై స్పష్టత రానుంది.