
Shahrukh Khan: షారుక్-సుహానా లకు వరుసగా లీగల్ ఇష్యూలు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా భావిస్తున్న 'కింగ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానాఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనుండటం ప్రత్యేకత. తెరపై నిజజీవిత తండ్రి-కూతుళ్లుగా నటించబోతున్నారని టాక్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంపై కొనసాగుతున్న పాజిటివ్ బజ్‌తో పాటు, షారుక్-సుహానా పేర్లు వరుసగా లీగల్ సమస్యల్లో చిక్కుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సుహానా ఖాన్ మహారాష్ట్రలోని థాల్ గ్రామంలో సుమారు రూ.12.91 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు. కానీ ఆ భూమి వ్యవసాయ భూమి కావడంతో,చట్టబద్ధమైన అనుమతులు లేకుండా కొనుగోలు చేయడం ఇలీగల్ అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Details
షారుక్ కు నోటీసులు జారీ
రైతు హోదా కోసం సుహానా దాదాపు రూ.77 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసినప్పటికీ, ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఇక మరోవైపు షారుక్ ఖాన్ నివాసానికి సంబంధించిన సమస్య కూడా తీవ్రతరమైంది. ఆయన ఇంటి నిర్మాణ పనులలో భాగంగా రోడ్డును ఆక్రమించారనే ఆరోపణలు బొంబాయి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ నుంచి వచ్చాయి. ఈ అంశంపై ఇటీవల షారుక్‌కు నోటీసులు జారీ చేశారు. కానీ సమాధానం రాకపోవడంతో అధికారులు మళ్లీ నోటీసులు పంపారు. ఒకవైపు 'కింగ్' షూటింగ్‌లో బిజీగా ఉన్న షారుక్, మరోవైపు వరుసగా వస్తున్న లీగల్ సమస్యలతో ఆయన కుటుంబానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.