Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌కు లీగల్ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు ప్రకాశ్‌రాజ్‌కు న్యాయపరమైన నోటీసులు పంపబడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాది ఈ నోటీసులను జారీ చేశారు. ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు హిందువుల భావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాలని కోరారు. రామలక్ష్మణుల గురించి ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. క్షమాపణలు తెలియజేయకపోతే, రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేస్తామని హెచ్చరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్:
రామాయణంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలని ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. వారు రావణాసురుడి పొలంలో పండ్లు దొంగిలించారని చెప్పారు. అప్పుడు శూర్పణఖ వచ్చి జీఎస్టీతో కలిపి 2 వేల డాలర్ల ఫైన్ కట్టాలని అడిగిందని… pic.twitter.com/DYmLvtqcZn
— RTV (@RTVnewsnetwork) April 17, 2026