Page Loader
Samantha:ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తాను.. అందుకే ఆ పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నా: సమంత
Samantha:ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తాను

Samantha:ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తాను.. అందుకే ఆ పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నా: సమంత

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

సమంత 'సిటడెల్‌: హనీ బన్నీ'లో తన అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. తనకు సవాలుగా అనిపించే ప్రాజెక్టులనే ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పారు. ''సాధారణమైన సినిమాలను ఆమోదించవచ్చు. కానీ ఇప్పుడు నా జీవితంలో ప్రతి ప్రాజెక్టును చివరిదిగా భావించే దశలో ఉన్నాను. ప్రేక్షకులపై గొప్ప ప్రభావాన్ని చూపే సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నాను. ఒక కథపై నేను వందశాతం నమ్మకం లేకపోతే, నేను ఆ పాత్రను చేయలేను. అందువల్లనే నేను ప్రాధాన్యతగల కథలను మాత్రమే అంగీకరిస్తున్నాను,'' అని సమంత పేర్కొన్నారు.

వివరాలు 

తదుపరి ప్రాజెక్ట్‌ 'మా ఇంటి బంగారం'

రాజ్ అండ్ డీకేతో కలిసి పని చేయడానికి కారణం గురించి మాట్లాడుతూ,''వారు ఎక్కువగా సవాలుగా అనిపించే పాత్రలను రూపొందిస్తారు.వారి ప్రాజెక్టుల్లో నటించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. వారు నటనకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చే కథలను సృష్టిస్తారు.గొప్ప చిత్రంలో నటించాను అనే భావన లేకుండా నేను పని చేయలేను,''అని చెప్పారు. రాజ్‌ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన 'సిటడెల్‌:హనీ బన్నీ'సిరీస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నక్రిటిక్స్‌ఛాయిస్‌ అవార్డుకు ఉత్తమ విదేశీభాష విభాగంలో నామినేట్‌ అయింది. ఇప్పుడు సమంత తన తదుపరి ప్రాజెక్ట్‌ 'మా ఇంటి బంగారం'ను ప్రకటించారు.ఇటీవలే ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈసంస్థ ద్వారానే ఈ సినిమా నిర్మించనున్నారు.దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.