Lokesh Kanagaraj :'DC' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే.. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్..!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'DC'. విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. దర్శకుడిగా ఇప్పటికే భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న లోకేష్.. హీరోగా చేసిన తొలి ప్రయత్నంలోనూ మంచి మార్కులు కొట్టేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 'DC' థియేటర్లలో విడుదలైన తర్వాత తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన అందుకుంది. యాక్షన్‌తో పాటు ఇంటెన్స్ ఎమోషన్స్‌ను మేళవించి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఫలితాన్ని అందుకున్నట్లు సమాచారం.
వివరాలు
హీరోగా చేసిన లొకేష్..
ఇక థియేటర్లలో సందడి చేసిన 'DC' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కాకుండా రెండు ప్రముఖ డిజిటల్ వేదికల్లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్‌లో 'DC' అందుబాటులోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తన సినిమాల్లో హీరోలకు పవర్‌ఫుల్ క్యారెక్టర్లను డిజైన్ చేసే లోకేష్ కనగరాజ్.. ఈసారి స్వయంగా హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు రావడం అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది.
వివరాలు
హీరోగా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్..
దర్శకుడిగా ఆయనకున్న ఇమేజ్‌కు తోడు, హీరోగా కూడా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
తెలుగు ప్రేక్షకుల్లోనూ లోకేష్ కనగరాజ్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో 'DC' ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది.
థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన అభిమానులు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
యాక్షన్ కథకు తగ్గట్టుగా ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లు టాక్.
అనిరుధ్ సంగీతం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది.