Samantha: ఉత్తర అమెరికాలో 'మా ఇంటి బంగారం'కు అరుదైన ఘనత
వ్రాసిన వారు
Moogati Shabari
Jul 05, 2026
04:13 pm
ఈ వార్తాకథనం ఏంటి
సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కుటుంబ కథా యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద విశేష విజయాన్ని నమోదు చేసింది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అక్కడ 2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి మరో మైలురాయిని అందుకుంది.
వివరాలు
రూ.85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు..
తెలుగులో మహిళా ప్రధాన పాత్ర ఆధారంగా రూపొందిన సోలో ఫీమేల్ లీడ్ చిత్రాల్లో, ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా 'మా ఇంటి బంగారం' ప్రత్యేక రికార్డు నెలకొల్పింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.85 కోట్లకు మించిన గ్రాస్‌ను రాబట్టింది. ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.