
గ్రాండ్ గా మా ఊరి పొలిమేర-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. పార్ట్ 1 కంటే ఇది పది రెట్లు త్రిల్లింగ్ అంట
ఈ వార్తాకథనం ఏంటి
డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన టాలీవుడ్ చిత్రం మా ఊరి పొలిమెర-2, రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శీను వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని దస్పల్లా కన్వెన్షన్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరిగింది.
అయితే ఈ సినిమాకి నటుడు అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొలిమెర -2ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ నిర్మించింది.వంశీ నందిపాటి పంపిణీ చేయనున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉత్కంఠను రెకెత్తిస్తోంది.
మరోవైపు మా ఊరిపొలిమేర పార్ట్-1 కంటే, పార్టు 2 పది రెట్లు ఉత్కంఠగా సాగుతుందని దర్శకుడు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పార్ట్ 1 కంటే పార్ట్ 2 పది రెట్లు త్రిల్లింగ్
Part 2 is ten times thrilling than Part 1 : Maa Oori Polimera Director - https://t.co/HR9SVCRjs1
— Telugu Funda (@TeluguFunda) October 31, 2023