
Maremma : హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు .. పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్.. టైటిల్ ఏంటో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నారు. మాధవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి మారెమ్మ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మాధవ్ లుక్ అయితే అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి,మెడలో క్యాజువల్‌గా చుట్టుకున్న టవల్‌తో,మాధవ్ రగ్గడ్ రూరల్ హీరోగా కనిపించారు.
వివరాలు
మాధవ్‌కు జోడీగా దీపా బాలు
పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న గేదె చిత్రం శక్తిని, ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఒక పొడవాటి కర్రను పట్టుకుని, ఎదురయ్యే ఏ సవాలునైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాధవ్ కనిపించారు. మొత్తంగా చెప్పాలంటే, టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా ఓ రేంజ్‌లో పేలిపోయింది. ఈ చిత్రంలో మాధవ్‌కు జోడీగా దీపా బాలు కథానాయికగా నటిస్తోంది. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూపలక్ష్మి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా ప్రశాంత్ ఆర్ విహారి బాణీలు సమకూరుస్తుండగా, మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని త్యాగం...
A sacrifice the world will never forget...
— Ravi Teja (@RaviTeja_offl) July 7, 2025
The first look poster looks very intense, My best wishes to @maadhav_9999 and the team of #Maremma 🤗👍🏻 pic.twitter.com/GiRAMgW2Q7