Loading...
GDN movie : మాధవన్‌ 'జి.డి.ఎన్‌' మూవీ ఎలా ఉందంటే..!
మాధవన్‌ 'జి.డి.ఎన్‌' మూవీ ఎలా ఉందంటే..!

GDN movie : మాధవన్‌ 'జి.డి.ఎన్‌' మూవీ ఎలా ఉందంటే..!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

నిజ జీవిత వ్యక్తుల పాత్రలకు కేరాఫ్‌గా మారిపోయారు మాధవన్‌. రాకెట్రీ'లో నంబి నారాయణన్‌గా, 'దురంధర్‌'లో అజిత్‌ డోభాల్‌ను పోలిన అజయ్‌ సన్యాల్‌ పాత్రలో నటించి మెప్పించిన ఆయన.. ఈసారి జి.డి. నాయుడు పాత్రలో తెరపై మెరిశారు. భారతీయ ఎడిసన్‌గా పేరుగాంచిన గొప్ప ఆవిష్కర్త, వాణిజ్య మేధావి, తెలుగు మూలాలున్న ప్రముఖుడు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అలియాస్‌ జి.డి. నాయుడు. దక్షిణ భారతదేశంలో వాణిజ్య విప్లవానికి బాటలు వేసిన ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే 'జి.డి.ఎన్‌'. ఇందులో టైటిల్‌ పాత్రను పోషించడంతో పాటు నిర్మాణం, స్క్రీన్‌ప్లే రచనలోనూ మాధవన్‌ భాగమయ్యారు. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..

వివరాలు

కథేంటంటే..

కోయంబత్తూరులోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన జి.డి. నాయుడు (మాధవన్‌) చదువు మూడో తరగతితోనే ఆగిపోతుంది.

జీవితంలో డిగ్రీల కంటే నేర్చుకోవాలన్న తపన, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలమే ముఖ్యమని ఆయన నమ్ముతారు.

బ్రిటిష్‌ పాలన సమయంలో ఓ బ్రిటిషర్‌ దగ్గర చూసిన మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

ఆ తర్వాత తన సొంత ఆలోచనలతో మరో వాహనాన్ని తయారు చేస్తారు. అక్కడి నుంచి ఆయన ఆవిష్కరణల ప్రయాణం మొదలవుతుంది.

దైనందిన జీవితంలో ఉపయోగపడే ఎన్నో వస్తువులు, పనిముట్లను తయారు చేయడంతో పాటు.. భారతదేశంలో తొలి విద్యుత్‌ మోటార్‌ను రూపొందించే స్థాయికి ఆయన ప్రయాణం సాగుతుంది.

వివరాలు

రవాణా రంగంలోనూ జి.డి. నాయుడు తనదైన ముద్ర..

రవాణా రంగంలోనూ జి.డి. నాయుడు తనదైన ముద్ర వేశారు. ఓ బస్సును కొనుగోలు చేసి కొన్నేళ్ల పాటు స్వయంగా నడిపిన ఆయన.. ఆ తర్వాత 600 వాహనాలతో కూడిన యునైటెడ్‌ మోటార్‌ సర్వీస్‌ (యూఎంఎస్‌) సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు.

వ్యాపారంలో లాభాలతో పాటు సేవా దృక్పథం కూడా ఉండాలని నమ్మి దాన్ని ఆచరించిన వ్యక్తి జి.డి. నాయుడు.

భారతదేశంలోనే తొలి పాలిటెక్నిక్‌ కళాశాలను కూడా ఆయన స్థాపిస్తారు.

అయితే ఆయన ఎదుగుదల అప్పటి బ్రిటిష్‌ అధికారులతో పాటు కొంతమంది పారిశ్రామికవేత్తలకు కంటగింపుగా మారుతుంది.

ఎలాగైనా నాయుడిని ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో భారీగా పన్నులు విధించడం, ఆయనకు వ్యతిరేకంగా అధికారులను ఉసిగొల్పడం వంటి ప్రయత్నాలు చేస్తారు.

ADVERTISEMENT

వివరాలు

దేశద్రోహి అనే ముద్ర..

అంతేకాదు.. ఆయనపై దేశద్రోహి అనే ముద్ర వేయాలని ప్రయత్నించడంతో పాటు, ఆయన కన్న కలలను నీరుగార్చి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కూడా కుట్రలు చేస్తారు.

మరి ఈ ఎత్తుగడలను జి.డి. నాయుడు ఎలా తిప్పికొట్టారు? ఆయన భార్య రంగనాయకి (దుషార విజయన్‌), ఆయన గురించి తెలిసిన ప్రజలు ఎలా అండగా నిలిచారు?

మొదటి భార్య చెల్లమ్మ (ప్రియమణి) ఉండగానే రంగనాయకిని వివాహం చేసుకోవడానికి కారణమేంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ADVERTISEMENT